[t4b-ticker]

కొండా సురేఖ కీలక పోస్ట్.. “కాసేపట్లో బిగ్ అప్డేట్” అంటూ సంచలనం

ప్రతిపక్షం, సెప్టెంబర్ 04, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. “కాసేపట్లో బిగ్ అప్డేట్.. స్టేట్యూన్ తెలంగాణ” అంటూ కొండా సురేఖ చేసిన పోస్టుతో ఆమె ఏ ప్రకటన చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.

ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ నుంచి ఈ పోస్ట్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్ననే ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో.. తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్టు రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు కారణమైంది.

తన తదుపరి రాజకీయ అడుగుపై కొండా సురేఖ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. “ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో కీలక నిర్ణయం ప్రకటిస్తా” అనే సందేశంతో ఆమె గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పోస్ట్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

కొండా సురేఖ చేయబోయే ప్రకటన ఏమిటి? పార్టీకి సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? లేక తనపై వచ్చిన పరిణామాలపై స్పందించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆమె నుంచి వచ్చే తదుపరి ప్రకటన కోసం అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు, రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా, కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె కుటుంబం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రస్తుతం ఆమె చేసిన పోస్టులో పూర్తి వివరాలు వెల్లడించకపోవడంతో అసలు ప్రకటన ఏమిటన్నది ఉత్కంఠగా మారింది.

“కాసేపట్లో బిగ్ అప్డేట్” అంటూ కొండా సురేఖ చేసిన తాజా పోస్టుతో తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెరలేవనుందా? అనే చర్చ జరుగుతోంది. ఆమె ప్రకటించబోయే నిర్ణయం ఏంటో తెలియాలంటే మరికాసేపు వేచి చూడాల్సిందే.

Spread the love

Related News

Latest News