ప్రతిపక్షం, జూన్ 27: నటి త్రిష గతంలో పెళ్లి, విడాకులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు విడాకులంటే ఇష్టం లేదని, ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఆ బంధాన్ని కొనసాగించాలనే అభిప్రాయం ఉందని ఆమె పేర్కొన్నారు. తన స్నేహితుల్లో చాలామంది పెళ్లి తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితి తనకు రావాలని కోరుకోవడం లేదని చెప్పారు. సరైన వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటానని, అలాంటి వ్యక్తి దొరకకపోయినా తనకు ఎలాంటి బాధ లేదని త్రిష స్పష్టం చేశారు.

















