నామాపురంలో సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలి.. ఎంపీడీవోకు వినతి

ప్రతి పక్షం – గట్టుప్పల్, అక్టోబర్ 05: మండల పరిధిలోని నామాపురం గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి నాయకులు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో వి. హిమబిందుకు వినతిపత్రం అందజేశారు.సుమారు 3 వేల జనాభా ఉన్న గ్రామానికి సమీపంలో గిరిజన తండా కూడా ఉందని, ఆరోగ్య సమస్యలు వస్తే ప్రైవేటు ఆసుపత్రులకు, పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల కోసం అంతంపేట, మర్రిగూడెం వెళ్లాల్సి రావడంతో రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో వి. హిమబిందు, తహసీల్దార్ కె. రాములు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News