[t4b-ticker]

ప్రజా సమస్యల పరిష్కారానికి 19న ‘ప్రజలతో ముఖాముఖి’

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్, ఆగస్టు 16: ప్రజా పాలనలో భాగంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 19న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఉన్న ఇందిరా భవన్‌లో కార్యక్రమం జరగనుంది.షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన సమస్యలను ప్రజలు మంత్రికి నేరుగా వివరించవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, సామాజిక భద్రత, ప్రభుత్వ సహాయం తదితర అంశాలపై వినతులను కూడా సమర్పించవచ్చు.ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

సద్వినియోగం చేసుకోవాలి

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఏర్పాటు చేస్తున్న ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని సంబంధిత వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. తమ సమస్యలు, వినతులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన అభ్యర్థనలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

Spread the love

Related News

Latest News