ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, ఆగస్టు 16: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్ విద్యానగర్ విజయదుర్గ కాలనీలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి దశలవారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విజయదుర్గ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని, కాలనీ అభివృద్ధికి అవసరమైన ఇతర మౌలిక వసతుల కల్పనకు కూడా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగమ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





























