ప్రతిపక్షం, జూన్ 29: గచ్చీబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్-2026 సీజన్-2లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ముంబయ్ డ్రీమర్స్‌పై 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా వీక్షించి విజేత జట్టుకు అభినందనలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ హీరోస్ కెప్టెన్ మన్యుయెల్ మొరెనోకు రగ్బీ ప్రీమియర్ లీగ్-2026 ట్రోఫీని అందజేశారు.
ఈ కార్యక్రమానికి సినీ నటుడు కొణిదెల చిరంజీవి, రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్, జీఎంఆర్ కార్పొరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్, ఒలింపియన్ పీవీ సింధు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె. శివసేనారెడ్డి, నటి మృణాల్ ఠాకూర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై మ్యాచ్‌ను ఆస్వాదించారు.
ఈ నెల 16న ప్రారంభమైన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 పోటీలు ఆదివారం జరిగిన ఫైనల్‌తో విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.




















