తనపై దుష్ప్రచారం చేశారని కేటీఆర్ ఆరోపణ

ప్రతిపక్షం, జూన్ 27: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్ఠ దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను జీవితంలో ఎప్పుడూ సిగరెట్ కూడా తాగలేదని, అలాంటి తనపై డ్రగ్స్ వాడుతున్నానంటూ అసత్య ప్రచారం చేశారని అన్నారు. మొదట్లో అలాంటి ఆరోపణలను పట్టించుకోలేదని, అయితే ఒక అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేయడం ద్వారా నిజమని నమ్మించే ప్రయత్నం చేశారని విమర్శించారు.

అలాగే తన ఫోన్ ట్యాప్ చేశానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయంటూ కొందరు మంత్రులే ప్రచారం చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News