రాయన్ పల్లి ప్రాజెక్టు మరమ్మత్తులు చేయాలి

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన నాయకులు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూన్ 15: మెదక్ మండలం రాయన్ పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలో దెబ్బతిన్న దోని, చెరువు తూముల మరమ్మతులు వెంటనే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రాయల్ పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలోని దోని కొట్టుకుపోయిందని తెలిపారు. దీంతో ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని, అయితే సంవత్సరం గడిచినా ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హై లెవల్ కాల్వ ద్వారా తిమ్మానగర్, మక్తభూపతిపూర్, గుట్టకిందిపల్లి, శివాయిపల్లి, మల్కాపూర్ తండా, వెంకటాపూర్ కొంటూర్ గ్రామాల చెరువులతో పాటు మెదక్ పట్టణంలోని గోసముద్రం, పిట్లంబేస్, బంగ్లా నాయకుని చెరువులు నిండుతాయని తెలిపారు. కాబట్టి వెంటనే కాల్వ మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.అలాగే గత ఏడాది వర్షాలకు పుష్పల వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయిందని, ప్రస్తుతం మట్టితో తాత్కాలికంగా నిర్మాణం చేపట్టారని తెలిపారు. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల పుష్పల వాగుపై శాశ్వత వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. హవేలీ ఘనపూర్ మండలంలోని ఘనపూర్ చెరువు, పాతూరు కొచ్చెరువు గండ్లు పడినా ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదని, వాటిని కూడా వెంటనే పునరుద్ధరించాలని కోరారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ నాయకులు అంజాగౌడ్ మామూళ్ల ఆంజనేయులు గడ్డమీద కృష్ణ గౌడ్ ఆర్కే శ్రీనివాస్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి కృష్ణారెడ్డి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News