ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, సెప్టెంబర్ 06: ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఎపిసోడ్ మరింత ముదిరింది ఈ వివాదంలో మాధురి రాథోడ్ ఆదివారం ఆత్మహత్యాయత్నం కి ప్రయత్నించింది వెంటనే అప్రమత్తమై న ఆమె కుటుంబ సభ్యులు మాధురిని కాపాడారు.ఇప్పుడు ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ బలవన్మరణానికి యత్నించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.తోటి డాన్సర్ ఈశ్వర్ సాయిపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.
అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు బద్దలుకొట్టి ఆమెను ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ట్లు సమాచారంపోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఈశ్వర్ సాయిని అరెస్టు చేయకుండా నార్సింగి పోలీసులు ఉద్దేశపూర్వకంగా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.అంటూ మాధురి రాథోడ్ స్వయంగా చేసిన ఆరోపణ ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది. న్యాయం చేయాల్సిన రక్షకభ టులే నిందితుడికి కొమ్ముకాస్తున్నారనే విమర్శలు ఈ వ్యవ హారంలో పెను దుమారానికి దారితీశాయి.





























