ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 28: భగవద్గీత జయంతి సందర్భంగా ఇస్కాన్ అత్తాపూర్ ద ట్రావెలింగ్ సంకేర్తన్ పార్టీ ఆధ్వర్యంలో 20 మంది హరే కృష్ణ సభ్యులు భవద్గీత గ్రంథ వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈ సందర్భంగా హరే రామ హరే కృష్ణ అంటూ సంకీర్తన చేస్తూ భగవద్గీత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు..
మోక్ష ఏకాదశి డిసెంబర్ 25న వస్తుంది కాబట్టి ఇస్కాన్ భక్తులు ప్రతి మందిరం నుంచి బయటకు వెళ్లి గ్రామ గ్రామాన భవద్గీత, భాగవత గ్రంథాలను విక్రయం చేస్తామని తెలిపారు..ఇంటింటా భగవద్గీత తీసుకొని జీవితాన్ని ఆస్వాదించాలని సూచించారు.

Related News

Latest News