Trending Now

‘రజాకార్’ సినిమా రిలీజ్ ఆపాలి.. హైకోర్టులో పిటిషన్

ప్రతిపక్షం, సినిమా: హైదరాబాద్ నిశబ్ద మారణహోమం ట్యాగ్ లైన్ తో మార్చి 15న రిలీజ్ కాబోతున్న రజాకార్ సినిమా విడుదలను ఆపాలంటూ ఏపీసీఆర్ (అసోసియేషన్ ఫర్ సివిల్ రైట్స్) సంస్థ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ సినిమా రెండు మత వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కంటెంట్ ఉందని ఏపీసీఆర్ సెక్రటరీ నదీమ్ ఆరోపించారు. తెలంగాణలో ఉన్న గంగా-జమునా తహెజీబ్ కు ఈ సినిమా తీవ్ర విఘాతం కలిగిస్తుందని నదీమ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News