మృతురాలి కుటుంబానికి హరీశ్‌రావు ఆర్థిక సాయం

గట్లమల్యాలలో బాధిత కుటుంబానికి రూ.5 వేల అందజేత

ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 22: సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చామంతుల ఎల్లవ్వ కుటుంబానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆర్థిక సాయం అందించారు. ఎల్లవ్వ మృతి విషయాన్ని గ్రామ పెద్దలు హరీశ్‌ రావు దృష్టికి తీసుకువెళ్ళారు. స్పందించిన హరీశ్‌ రావు తక్షణ సాయంగా రూ.5 వేలు పంపించారు. హరీశ్ రావు ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంగే నరేశ్, ఉప సర్పంచ్ తిప్పని శ్రీనివాస్, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు రేణుక వేణుగోపాల్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రబాబు, వార్డు సభ్యులు లోకటి సత్తయ్య, నోముల రవీందర్, బీఆర్‌ఎస్ నాయకులు పుట్ట వెంకన్న, చామంతుల అశోక్, రంగు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News