అస్సాంలో విషాదం.. కుప్పకూలిన భారత వైమానిక దళ విమానం, ఐదుగురు మృతి

ప్రతిపక్షం, జూన్ 13: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 కార్గో విమానం కుప్పకూలిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన కో-పైలట్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై భారత వైమానిక దళం ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News