Trending Now

ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలేవి రేవంత్ రెడ్డి..?

మెదక్ ఎంపీ రఘునందన్ రావు

ప్రతిపక్షం, సిద్దిపేట, ప్రతినిధి 14: సీఎం రేవంత్ రెడ్డి పోన్ ట్యాపింగ్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి నేటికీ దానిపై చర్యలు ఏవి అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తాడూరి బాలగౌడ్ పంక్షన్ హల్‌లో మెదక్ ఎంపీ రఘు నందన్ రావు విజయోత్సవ సభ జరిగింది. రఘునందన్ రావు కి పార్టీ శ్రేణులు బుల్డోజర్ తో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కమాన్, గాంధీ విక్టరీ చౌరస్తా మీదుగా ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో 25ఏండ్ల నుండీ అధికారం అహంకారంగా మారి ప్రజలు తన గెలుపుకు కృషి చేశారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలను అణిచివేయాలని చూశారన్నారు. బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే ఈ విజయమన్నారు. తెలంగాణ లో ఒక్క ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలవలేదనీ హేద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎక్కడ ప్రాజెక్ట్ కట్టలేనట్టు బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించారని మండిపడ్డారు. మల్లన్న సాగర్‌లో తన చితి తానే పెర్చుకొని మరణించిన రైతు మల్లారెడ్డికి తనా గెలుపు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వెంకట్ రాంరెడ్డిని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించిన ప్రతి పైసా కి సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా లో లెక్క చెబుదామని వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నికలలో రఘు నందన్ రావు గెలవడని హీద్దేవ చేశారన్నారు.

1962 తర్వాత దేశ చరిత్రలో ఒకే పార్టీ ఓకే వ్యక్తి మూడుసార్లు ప్రధాని అయినా చరిత్ర బీజేపీ పార్టీది మోడీ ది అన్నారు. దుబ్బాక లో రఘు నందన్ రావు కి ప్రోటోకాల్ లేకుండా చేద్దామని అనుకున్నారని, కానీ నేడు సిద్దిపేట లో కూడా ప్రోటోకాల్ వచ్చిందన్నారు. నాయకునికి ముఖ్యంగా నేనే గెలుస్తా.. అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నక్సల్స్ ఉన్న సమయంలోనే బీజేపీ కార్యకర్తలు భయపడలేదనీ ధైర్యాన్ని నూరి పోశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందని ఆనందం వ్యక్తం చేశారు.

నా గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు పరోక్షంగా ప్రచారం చేశారన్నారు. లోకల్ బాడి ఎన్నికలు నిర్వహించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు పాత, కొత్త సీఎం లను బొందపెట్టారని దుయ్యబట్టారు. ఎన్ని కుతంత్రాలు, ఎన్ని డబ్బులు పంచినా కూడా దేశంలో బీజేపీ గెలిచిందని అన్నారు. ఏనుకట నరకాసురుడు చనిపోతే దీపావళి జర్పుకున్నట్టు నేడు మెదక్ లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారన్నారు. హరీష్ రావు స్థానికుడు కాదు ఏనాడైనా ప్రశ్నిస్తారు అని ముందు చూపుతో బలవంతంగా బెజ్జంకి మండలం ను సిద్దిపేటలో కలిపారన్నారు. వెంకట్ రాంరెడ్డి 30రోజులలో గజ్వేల్ ప్రాంత క్షిరా సాగర్ రైతులకు వారి భూములను తిరిగి ఇవ్వకపోతే ఎక్కడి వరకు అయినా పోరాటం చేస్తామని అన్నారు. రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కి, సీఎం రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే వెంకట్ రాంరెడ్డి గుంజుకున్న గజ్వేల్ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Spread the love

Related News