ప్రతిపక్షం, జూలై 04. సికింద్రాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అధికారులకు, బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. అవసరమైతే ప్రజలకు సహాయం అందించేలా ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం చిలకలగూడలో స్థానికులు ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని పరిశీలించిన పద్మారావు గౌడ్, అనంతరం జోషి కాంపౌండ్లో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో నమోదయ్యేలా బీఎల్ఏలు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నేత తీగుళ్ల కిశోర్ కుమార్, సమన్వయకర్త రాజా సుందర్, జహాంగీర్ భాయి తదితరులు పాల్గొన్నారు.

















