యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి సురేఖకు సభ్యత్వం

ప్రతిపక్షం, జూలై 01: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఛైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డిని నియమించింది.

బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామితో పాటు సినీ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, సి. విజయరాజం, తూళ్ల విజయేందర్, పి. ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం. రాఘవేంద్ర రావు, డి. లక్ష్మీనారాయణ నాయక్‌లకు చోటు కల్పించింది. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి, పరిపాలన, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో ఈ ట్రస్ట్ బోర్డు కీలక బాధ్యతలు నిర్వహించనుంది.

Spread the love

Related News

Latest News