ప్రతిపక్షం, జూన్ 24: ప్రజా పాలనలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని, అందుకే ఇప్పుడు కొత్త కార్డుల దరఖాస్తులు రాలేదని పొన్నం ప్రభాకర్ చెప్పారు. గాంధీ భవన్లో జరిగిన ప్రజా సమస్యల ముఖాముఖి అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రస్తుతం భూసమస్యలు, పెన్షన్లపై వినతులు వస్తున్నాయని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు పరిష్కారం కాకుంటే నేరుగా గాంధీభవన్ రావాలని, తాము పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

















