నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల..
ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి, మార్చ్,27: సోన్ పోలీస్ స్టేషన్ ను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం ఆకస్మి కంగా తనిఖీలు చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని అన్నారు. అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఆర్థిక, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం రిసెప్షన్, టెక్నికల్ రూంలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పోలీస్ సిబ్బంది యొక్క విధులు, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొన్ ఎస్సై సంతోషం, రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.