మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

ప్రతిపక్షం, జూన్ 12: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా నామినేషన్ తిరస్కరణ వ్యవహారాల్లో గతంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తీర్పులు ఉంటే సమర్పించాలని న్యాయమూర్తులు సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో నిర్దేశిత న్యాయపరమైన మార్గాలను అనుసరించాలని పేర్కొన్నారు.

నామినేషన్ తిరస్కరణపై అభ్యంతరాలు ఉంటే ముందుగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని, చట్టపరమైన ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా, సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ఈ వ్యవహారంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Spread the love

Related News

Latest News