- కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివ్రుద్ధి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు చేసింది శూన్యం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్
ప్రతిపక్షం బ్యూరో, జూలై 04: రాష్ట్ర ప్రభుత్వం ‘‘సర్’’ ను ఉపయోగించుకుని హిందువల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సహకరించడం లేదన్నారు. ఫలితంగా అధికారులు క్షేత్రస్థాయిలో హిందువుల ఇండ్లకు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదన్నారు. తెలంగాణలోని హిందువులంతా జాగ్రుతం కావాలని, లేనిపక్షంలో తెలంగాణలో హిందువులంతా మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వేములవాడ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో చేపట్టిన పలు అభివ్రుద్ది కార్యక్రమాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అందులో భాగంగా కాచారం గ్రామంలో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన CC రోడ్డు ప్రారంభించారు. మరో 10లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దమ్మన్నపేట గ్రామంలో 8 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దేశాయ్ పేట్ లో 9 లక్షల రూపాయల MP లాడ్స్ నిధులతో నిర్మించిన బస్టాండ్ ను ప్రారంభించారు. మరో 36 లక్షల వ్యయంతో నిర్మించిన CC రోడ్డు ప్రారంభించారు. మన్నెగూడెంలో 10 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఇక కథలాపూర్ మండలం విషయానికొస్తే… గంబీర్ పూర్ లో 4 లక్షల 50 వేల వ్యయంతో సీసీ డ్రెయిన్, పోసానిపేటలో 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, దూంపేటలో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమారం మండలం దేశాయ్ పేటలో మీడియాతో మాట్లాడారు.
- రోడ్ల కోసమే రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినం
గత 7 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం 22 వేల కోట్లకుపైగా కేంద్ర నిధులు తీసుకొస్తే, అందులో రోడ్ల నిర్మాణం కోసమే 10 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు . వేమలవాడ నియోజకవర్గంలోనే ఇటీవల మల్యాల నుండి కాచారం వరకు, సిరికొండ నుండి వేములవాడ వరకు 20 కోట్లతో, మేడపల్లి నుండి గోవిందారం వరకు రూ.25 కోట్లతో, సిరికొండ నుండి వేములవాడ వరకు రూ.23 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
రేవంత్ కు శుభాకాంక్షలు..
కష్టపడి పనిచేసి క్షేత్రస్థాయి నుండి ఎదిగే లీడర్ ను సమాజం గౌరవిస్తుంది. అందులో భాగంగా 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు .
















