విజయ్-త్రిషపై వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

ప్రతిపక్షం, జూలై 03: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చి విజయ్ ఇబ్బందులు పడుతున్నారని, గతంలో నటి త్రిషతో సంతోషంగా గడిపిన రోజులను గుర్తు చేసుకుంటున్నారేమో అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కేసు నమోదు చేసి పోలీసులు చర్యలు చేపట్టారు.

Spread the love

Related News

Latest News