సెన్సార్ బోర్డును రద్దు చేయాలి: ఆర్జీవీ

ప్రతిపక్షం, జూలై 15: సినిమా సెన్సార్ విధానంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. సెన్సార్‌షిప్ అనేది పెద్దలను చిన్నపిల్లల్లా భావించే విధానమని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

ఇంటర్నెట్ యుగంలో సినిమాలను కత్తిరించడం, సన్నివేశాలు తొలగించడం హాస్యాస్పదమని పేర్కొన్న ఆయన, ఇలాంటి చర్యలు సృజనాత్మక స్వేచ్ఛను దెబ్బతీస్తాయని అన్నారు. సెన్సార్ బోర్డు నిర్ణయాలకు చిత్ర పరిశ్రమ లొంగకుండా ఏకమై ఈ వ్యవస్థపై పోరాడాలని పిలుపునిచ్చారు.

సినిమాలపై కత్తెర వేయడం కంటే ప్రేక్షకులకు తగిన కంటెంట్ రేటింగ్ ఇవ్వడమే సరైన విధానమని, సెన్సార్ బోర్డు స్థానంలో రేటింగ్ వ్యవస్థను అమలు చేయాలని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.

Spread the love

Related News

Latest News