Trending Now

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి..

నిర్మల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అశీష్ సాంగ్వాన్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 27 : పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు సందర్బంగా అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నిర్మల్ జిల్లా ఓట్ల లెక్కింపును ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కౌంటింగ్ అధికారులు జూన్ 4వ తేదీన ఉదయం 5.30 నిమిషాలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, సమయానికి కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని, అనంతరం ఈవీఎం లలో నమోదైన ఓట్లను లెక్కించాలని ఆదేశించారు. రౌండ్ల వారిగా లెక్కించిన ఓట్ల వివరాలను తెలిపేందుకు స్క్రీన్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత ఏఆర్వో లకు సమాచారం అందించాలని, రౌండ్ల వారిగా లెక్కింపు పూర్తికాగానే సంబంధిత ఫారాలు అన్ని జాగ్రత్తగా నింపాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ లు సిబ్బందికి ఓట్ల లెక్కింపు సరళిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తదితర అంశాల పై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో నిర్మల్, అదిలాబాద్ అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, శ్యామలా దేవి, నిర్మల్, బైంసా, ఉట్నూర్ ఆర్డీవోలు రత్న కళ్యాణి కోమల్ రెడ్డి, జీవాకర్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News