అయోధ్యలో ప్రేమజంటపై కాషాయ వస్త్రధారుల దాడి

ప్రతిపక్షం, జూన్ 06: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ ప్రేమజంటపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తులసి ఉద్యాన్ పార్కులో కూర్చున్న యువజంటను కాషాయ వస్త్రాలు ధరించిన కొందరు వ్యక్తులు అడ్డగించి దుర్భాషలాడుతూ, అనంతరం శారీరకంగా దాడి చేసినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది.

దాడి నుంచి తప్పించుకునేందుకు యువజంట పార్కు బయటకు పరుగులు తీసినా, నిందితులు వారిని వెంబడించినట్లు వీడియోలో నమోదైంది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

ఈ ఘటనపై సామాజిక కార్యకర్తలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛలను హరించే విధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడటం అంగీకారయోగ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News