ప్రతిపక్షం, జూలై 07: హైదరాబాద్‌లో భార్యపై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన కేసులో భర్తకు ఐదేళ్ల కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఐదో అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. సాయిగూడకు చెందిన రామ్ బిరాదర్ భార్య లతా బిరాదర్‌పై నిరంతరం అసహజ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. బాధితురాలు 2018 సెప్టెంబరులో చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు శిక్ష విధించింది.
















