రక్తదానం మహాదానం – మీ ఒక్క యూనిట్ రక్తం ఎవరికో ఒకరికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది.

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం సందర్బంగా రక్త దాన శిబిరం.
  • 26వ సారి రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా, గర్వంగా భావిస్తున్నాను.
  • 2016 సంవత్సరం నుండి నేటి వరకు రాజన్న కార్యక్రమాల్లో వరుసగా రక్త దానం .
  • రక్తాన్ని తలసేమియా బాధిత చిన్నారుల కోసం అందించడం అభినందనీయం.
  • ఈ గొప్ప సేవ అనేక చిన్నారుల జీవితాల్లో ఆశాకిరణంగా నిలుస్తుంది .
  • నల్గొండ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి

ప్రతి పక్షం, మునుగోడు జూన్ 02: మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు, మా బాస్ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నల్గొండ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డితలసేమియా బాధిత చిన్నారుల సహాయార్థం నిర్వహించిన మహా రక్తదాన శిబిరంలో భాగంగా ఈ రోజు నేను 26వ సారి రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా, గర్వంగా భావిస్తున్నాను అని తెలిపారు .2016 సంవత్సరం నుండి నేటి వరకు రాజన్న జన్మదినం సందర్భంగా నా ఆద్వర్యంలో నా యువజన కాంగ్రెస్ తమ్ముళ్ల సహకారంతో వరుసగా 10 రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది ప్రాణాలకు అండగా నిలవగలిగాము అని పేర్కొన్నారు .ఈ రోజు నిర్వహించిన రక్తదాన శిబిరంలో 91 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ అమూల్యమైన రక్తాన్ని తలసేమియా బాధిత చిన్నారుల కోసం అందించడం అభినందనీయం. వారి ఈ గొప్ప సేవ అనేక చిన్నారుల జీవితాల్లో ఆశాకిరణంగా నిలుస్తుంది అని చెప్పారు .
ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి రక్తదాతకు, సహకరించిన ప్రతి కార్యకర్తకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Spread the love

Related News

Latest News