ప్రతిపక్షం, దేవరకద్ర: పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ప్రచారంలో భాగంగా మదనాపూర్ లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో మదనపురం బీఆర్ఎస్ పార్టీకి ఎంపీపీ J.పద్మావతమ్మ, సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ J.వెంకట్ నారాయణ, మాజీ ఎంపిటిసి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ మాసన్న, నెల్విడి ఎంపిటిసి కురుమన్న, బీఆర్ఎస్ మదనపురం మండల మాజీ అధ్యక్షులు వడ్డే రాములు పార్టీలో చేరారు. అలాగే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా జియంఆర్, వంశీచంద్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో, పెద్ద ఎత్తున ఘనవిజయం సాధించబోతుందనిపేర్కొన్నారు.
మహబూబ్నగర్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి రెండు లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పోటీనే కాదని, బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలను నెరవేర్చిందని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రజలకు ఇచ్చిన అన్ని గ్యారెంటీలను నెరవేరుస్తామని, వీటితోపాటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. దేశాన్ని పదేళ్లు పరిపాలించిన బిజెపి పార్టీ దేశాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసిందని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని రైతులను మోసం చేసిన బీజేపీ పార్టీకి, పూటకో పార్టీ మారే బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని జియంఆర్ అన్నారు.