సా.6.15గంటలకు.. మోదీ-ట్రంప్ కీలక భేటీ

ప్రతిపక్షం, జూన్ 17: ఫ్రాన్స్‌లో ఈరోజు సాయంత్రం 6.15 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక భేటీ జరగనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హార్ముజ్ జలసంధి భద్రత, ఇంధన భాగస్వామ్యం, భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల బలోపేతం వంటి అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించనున్నారు.

ఇటీవల అమెరికా దళాల దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల రక్షణ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌కు వెళ్లిన ప్రధాని మోదీ, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌తో జరగనున్న భేటీపై అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Spread the love

Related News

Latest News