దసరా సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతిరాజు సేవా కార్యక్రమం
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 12: దసరా పండుగను పురస్కరించుకొని మెదక్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న 174 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు తెలిపారు. కార్మికుల సేవలను గుర్తించి పండుగ సందర్భంగా వారికి సరుకులు అందించినట్లు పేర్కొన్నారు.స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు సహకారంతో మెదక్ పట్టణ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా రాందాస్ చౌరస్తా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా, బోధన్ చౌరస్తాలను రూ.2 కోట్లతో ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే సహకారంతో పట్టణంలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నవీన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.






























