Trending Now

దేశం వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది : మల్లు రవి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: దేశం వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. గాంధీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలోరాహూల్ గాంధీ ప్రధాని చెయ్యాలని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. హిట్లర్ క్యాబినెట్‌లో గోబెల్ ఉన్నట్లే మోడీ కాబినెట్‌లో కిషనరెడ్డి ఉన్నారని.. మోడీ చెప్పే అబద్ధాలను కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 లోపే రైతు రుణమాఫీ రూ. 2 లక్షలు చేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. అందుకు కట్టుబడి ఉన్నామని.. రైతులకు కూడా నమ్మకం ఉందన్నారు. అందుకే రుణ మాఫీ చెయ్యరు అని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్న సంగతి బీజేపీ కి తెలియదా..? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్న విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ నాయకులు సోది చెప్పుతున్నారు. కిషన్ రెడ్డి స్థాయి సోది చెప్పే స్థాయికి వెళ్లారని ఎద్దేవా చేశారు.

తెలంగాణాలో రాజకీయ పు:నరేకీకరణ జరుగుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్, అప్ కలిసి ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇంకోసారి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తం అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చినా తల్లి సోనియా గాంధీ కి సన్మానం చేస్తాం. సోనియా గాంధీ రాకను అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారు. కిషన్ రెడ్డి జాగర్త.. అని హెచ్చరించారు. కేసీఅర్‌కు 2023 డిసెంబర్‌లో ప్రజలు సన్మానం చేశారన్నారు.

Spread the love

Related News

Latest News