జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉత్తరాల ఉద్యమం

  • టి యు డబ్ల్యూ జే హెచ్ 143 జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రావు

వనపర్తి ప్రతినిధి,అక్టోబర్02(ప్రతిపక్షం): జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని (టియూడబ్ల్యూ జే )ఎస్ 143 యూనియన్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉత్తరాల ఉద్యమాన్ని జిల్లా అధ్యక్షులు బక్షి శ్రీధర్ రావు సారధ్యంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు.అనంతరం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బక్షి శ్రీధర్ రావు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హాయంలో జర్నలిస్టులకు ఇచ్చిన ఫ్లాట్ లను కొందరు విచ్చిన్నం చేసిన పట్టించుకోలేదని తక్షణమే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలకు, హెల్త్ కార్డులు, అందరికీ అక్కడే అక్రిడేషన్ లు, ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులకు రాష్ట్రస్థాయి లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు నాగేశ్వర్, సామాజికవేతలు నాగరాజ్, సిపిఐ నాయకులు గోపాలకృష్ణ, యుటిఎఫ్ నాయకులు కృష్ణయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని వారి సమస్యల కోసం అండగా ఉంటామని అన్నారు.కార్యక్రమంలో టుయు డబ్ల్యూజె హెచ్143 జిల్లా మాజీ అధ్యక్షులు కృష్ణ యాదవ్, మోడల చంద్రశేఖర్, జానయ్య, సుంకరి రమేష్, పాషా, ఈశ్వరయ్య, ప్రవీణ్ రెడ్డి, లింగేష్, తీర్మాలేష్, గోవర్ధన్, ఆంజనేయులు, రవికాంత్, రమేష్,రాముడు, తీర్పత్తయ్య, సురేష్ కుమార్, లక్ష్మినారాయణ రవీందర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News