Trending Now

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం..

ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 13: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా హుస్నాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి బీసీ, సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుటుంబ సభ్యులతొ కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఓటు వేయడానికి హుస్నాబాద్ బస్ స్టాప్ నుండి కరీంనగర్ వెళ్ళే బస్సులో ప్రయాణించి జూనియర్ కాలేజి స్టాప్ వరకు కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా టికెట్ తీసుకొని బస్సుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరునిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించానని బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మతతత్త్వానికో, ప్రాంతీయ తత్వానీకో ఇతరత్రా ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛ గా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్న అన్నారు. పూర్తిగా స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యం నిలవాలంటే అఖండ భారతదేశం లోపల ఓటు అనే ఆయుధం ద్వారా అనేక అంశాలు మారుతుంటాయని ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులు ఉన్న, ఎన్ని బాధ్యతలు ఉన్న, విధిగా తమ ఇటు హక్కును వినియోగించుకోవాలని ఇది మన బాధ్యత అన్నారు. మంత్రి వెంట టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ నాయకులు చిత్తరి రవీందర్, బూరుగు కృష్ణస్వామి, ఎండీ హసన్, గట్టు రాములు, పచ్చిమట్ల అశోక్ తదితరులున్నారు.

Spread the love

Related News