ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న క్యాబ్‌లో యువతిపై అత్యాచారం

ప్రతిపక్షం, జూలై 22: ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న ఓ క్యాబిన్ క్రూపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జులై 20న క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన బాధితురాలిని మార్గమధ్యంలో నిర్మాణంలో ఉన్న ఓ పాఠశాల సమీపానికి తీసుకెళ్లిన డ్రైవర్ ప్రశాంత్ కుమార్ (23) వాహనాన్ని ఆపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఘటన అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడిపై అత్యాచారం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రత విషయంలో రాజీ ఉండదని, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News