Trending Now

Rajinikanth: డీఎంకేపై రజనీకాంత్ ప్రశంసలు.. హీరో విజయ్‌కి కౌంటరేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్.. తమిళనాడు అధికార పార్టీ డీఎంకేపై ప్రశంసలు కురిపించారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందని అన్నారు. అయితే రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిజానికి రజినీ వ్యాఖ్యల వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేనప్పటికీ.. ఈ కామెంట్స్ హీరో విజయ్‌ను ఉద్దేశించినవే అన్న వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

ఇటీవలే హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం పార్టీ జెండాను సైతం ఆయన ఆవిష్కరించారు. అంతేకాదు, పలు సందర్భాల్లో విజయ్.. అధికార డీఎంకే పార్టీ మీద, ప్రభుత్వ పాలన మీద సైతం విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు హీరో విజయ్‌కి కౌంటరని, డీఎంకే నేతలే రజనీ చేత ఇలా మాట్లాడించారని వార్తలు వస్తున్నాయి. మరి, తన వ్యాఖ్యలపై రజినీకాంత్ వివరణ ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

Spread the love

Related News