Trending Now

రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడిద్దాం..

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..

దళిత సంఘాల ఐక్యకార్యారణ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం..

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 02: మనువాదాన్ని ఓడించి.. ప్రజలందరికి స్వేచ్చ, సమానత్వం, సోదరభావం, సామాజిక ఆర్ధిక, రాజకీయ న్యాయన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకొవాలని దళిత సంఘాల ఐక్యకార్యారణ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు లో గురువారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రక్షించే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ఓట్లు వేయద్దని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ పునాదుల మీదనే పాలించబడుతున్న పార్లమెంట్ వ్యవస్థని తప్పు పట్టాలని చూస్తున్న బిజెపి పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దళిత గిరిజనుల పై అనేక దాడులు జరుగుతున్న బిజెపి మతోన్మాద పార్టీ ఏనాడూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కులం పేరుతో మతం పేరుతో అనేక విద్వేషాలు రెచ్చగొడుతున్న పార్టీలను ప్రజలు తిప్పి కొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాజ్యాంగ రక్షణ ప్రచారోద్యమాన్ని చేపడుతున్నట్టు బత్తుల చంద్రం తెలిపారు. విద్య, ఉద్యోగం, ఆస్తులు, సంపదలను రాజకీయ అధికారాన్ని అణగారిన వర్గాలకు మనువాదం దూరం చేసిందన్నారు. మానవ హక్కుల ను అందించిన రాజ్యాంగాన్ని 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పదే.. పదే ప్రకటిస్తున్న కేంద్ర మంత్రుల కుట్రలను అర్ధం చెసుకొని రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ ని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకొవాలన్నారు.

ప్రజా సంఘాల నేత జగన్ మాట్లాడుతూ.. గత పదెళ్ళు గా మోడీ ఇచ్చిన ఏ హామీని నేరవెర్చలేదన్నారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సత్తయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తి ని కేంద్ర పాలకుకులు కాలరాస్తున్నారన్నారు. ఈ సమావేశం బీడ రాయులు, జగన్, పల్లెటూరి ప్రసాద్, కోదాటి శ్రీనివాస్, రవి బాబు, కాశపాక రాజేందర్ భీమ్ రావ్, ప్రశాంత్, నవీన్ గౌడ్, కామన్ నగేష్, జంగిరపు యెల్లేష్, శ్రీనివాస్ యాదవ్, రాజలింగం, శ్రీనివాస్, చింతల మల్లేశం, లింగయ్య, లింగయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News