బద్దిపడగలో విషాదంలో ఉన్న కుటుంబాలకు హరీశ్ రావు పరామర్శ

  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిఅండగా ఉంటామని భరోసా

ప్రతిపక్షం, నంగునూరు, జూలై 11: నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో పలువురు మృతుల కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శనివారం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు, తమ కుటుంబానికి పార్టీ తరఫున, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చుంచు స్వామి తండ్రి చుంచు లక్ష్మయ్య మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లిన హరీశ్ రావు, లక్ష్మయ్య చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది ఉప్పర మల్లేశం తండ్రి ఉప్పర బాలయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే వడ్లూరి శ్రీనివాస్ తల్లి వడ్లూరి బాలవ్వ మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులతో కొంతసేపు మాట్లాడిన హరీశ్ రావు, వారి సేవలను స్మరించుకుంటూ, కుటుంబాలకు మనోధైర్యం నింపేలా ఓదార్పు మాటలు చెప్పారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేముల వెంకటరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్, బద్దిపడగ సర్పంచ్ మంద రాజుతో పాటు పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News