ప్రతిపక్షం, జూలై 03: సిద్దిపేట జిల్లా డిసిసి సెక్రెటరీగా ఎండి హసన్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఎండి హసన్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో డిసిసి సెక్రెటరీగా అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి, జిల్లా కాంగ్రెస్ కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

















