ప్రతిపక్షం, జూలై 03: రాష్ట్రంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్లినికల్, నాన్-క్లినికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో మొత్తం 5,490 పోస్టులను మంజూరు చేసింది.
సనత్‌నగర్ టిమ్స్‌కు 2,360 పోస్టులు, అల్వాల్ టిమ్స్‌కు 1,565 పోస్టులు, ఎల్బీనగర్ టిమ్స్‌కు 1,565 పోస్టులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 788 పోస్టులు కేటాయించారు.
అలాగే సనత్‌నగర్, వరంగల్ ఆస్పత్రుల్లో 37 చొప్పున, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్‌లలో 35 చొప్పున ప్రత్యేక వైద్య విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నిర్ణయంతో వైద్య సేవలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.

















