రాయదుర్గం భూముల వివాదం.. బ్యాంకు చర్యల వెనుక రాజకీయ కోణమా?

ప్రతిపక్షం, జూన్ 20: హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలోని విలువైన భూముల వేలం అంశంలో ప్రభుత్వం, భారతీయ స్టేట్ బ్యాంకు మధ్య నెలకొన్న వివాదం రాజకీయ రంగు దాల్చుతోంది. భూ వేలాన్ని బ్యాంకు న్యాయస్థానంలో సవాలు చేయడం వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో బ్యాంకులు పరస్పర చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషిస్తాయని, నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అసాధారణమని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భూ వేలం ప్రక్రియను నిలిపివేయాలని బ్యాంకు కోర్టును ఆశ్రయించడం పలు సందేహాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు.

ముఖ్యంగా బ్యాంకు ఉన్నతాధికారి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో వివాదం వెనుక రాజకీయ ప్రభావం ఉందా అనే కోణంలో ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ ఆరోపణలపై బ్యాంకు అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. రాయదుర్గం భూముల వ్యవహారం ఇప్పుడు పరిపాలనా, న్యాయపర అంశాలతో పాటు రాజకీయ చర్చలకు కూడా కేంద్రబిందువుగా మారుతోంది.

Spread the love

Related News

Latest News