Trending Now

గన్‌ పార్క్‌ వద్దకు రాజీనామా లేఖతో మాజీ మంత్రి హరీశ్ రావు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గన్ పార్క్ వద్ద ప్రమాణం చేసేందుకు రాజీనామా లేఖతో హరీశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్‌కు ఆయన సవాలు చేసిన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం ఆయన గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా సవాలను స్వీకరించాలని.. తను రావడానికి మొహమాటంగా ఉంటే తన పీఏతో అయినా స్టాఫ్ తో అయినా రాజీనామా లేఖను పంపించాలి. జర్నలిస్టులో సాక్షిగా లేదా మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నాను అని స్పష్టంచేశారు.

ఆగస్టు 15th లోగా ఏకకాలంలో రుణమాఫీ తో పాటు ఆరు గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయాలి. కాంగ్రెస్ ఆరుగారింటిల పేరుతో ఇప్పటికే మోసం చేసిందని.. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు. రైతుల కోసం నా రాజీనామా నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు.

Spread the love

Related News