డీజీపీ కార్యాలయంలో విషాదం.. సర్వీస్ తుపాకీతో కానిస్టేబుల్ ఆత్మహత్య

ప్రతిపక్షం, జూలై 23: హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో జరిగినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనాస్థలిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైనట్లు సమాచారం. అయితే అందులో ఏమి రాసి ఉందన్న విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత, విధి సంబంధిత లేదా ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదికతో పాటు సూసైడ్ నోట్ ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News