Maa Nanna Super Hero Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తుండగా.. క్యామ్ ఎంటర్‌టైన్మెంట్స్, వీ సెల్యూలాయిట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సుధీర్ బాబు ఫస్ట్ లుక్ మెస్మరైజ్ చేసింది. తాజాగా, ఈ మూవీ టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది.
ఈ సినిమాలో సాయాజీ షిండే, సాయి చంద్ సుధీర్‌కు తండ్రులుగా యాక్ట్ చేశారు. ఇందులో ఓ తండ్రికి దగ్గరయ్యేందుకు కొడుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆయన మాత్రం దూరం పెడతాడు. అయితే ఇందులోని ఎమోషనల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాగా, హైదరాబాద్‌లో ‘మా నాన్న సూపర్ హీరో’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సుధీర్ బాబు తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు.