కోరుట్ల ఆర్టీఏలో ఏసీబీ షాక్.. అవకతవకలు వెలుగులోకి

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్ / కోరుట్ల, అక్టోబర్ 06: కోరుట్ల ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో పలు అవకతవకలు వెలుగుచూసినట్లు సమాచారం. ఎంవీఐ లేకుండానే కానిస్టేబుల్ గిరీష్‌కుమార్ డ్రైవింగ్ టెస్టులు, వాహనాల రిజిస్ట్రేషన్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ల ద్వారా అదనపు వసూళ్లు, కార్యాలయంలో వారికి స్వేచ్ఛా ప్రవేశం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. రికార్డుల నిర్వహణ, సిబ్బందిపై పర్యవేక్షణలో లోపాలు, ప్రమాణాలకు తగ్గని డ్రైవింగ్ ట్రాక్, సైన్‌బోర్డుల లేమిని ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రజా దరఖాస్తుల పనుల్లో ఏజెంట్ల జోక్యంపైనా అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News