Trending Now

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీకి హేమంత్ సోరెన్ దూరం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జార్ఖండ్ మాజీ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ద‌మ్కా ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు షికారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌కు జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) గురువారం తెర దించింది. ద‌మ్కా లోక్‌స‌భ స్థానానికి శిక‌రిపాడ ఎమ్మెల్యే న‌లిన్ సోరెన్‌ను జేఎంఎం నామినేట్ చేసింది. అదే విధంగా గిరిధిహ్ ఎంపీ స్థానానికి తుండి ఎమ్మెల్యే మ‌థుర ప్ర‌సాద్‌ను బ‌రిలో దింపింది.

Spread the love

Related News