విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసైతే విద్యాసంస్థలదే బాధ్యత.. కఠిన చర్యలు తప్పవు: డీజీపీ

ప్రతిపక్షం, జూలై 16: తెలంగాణలో విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా విద్యాసంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. విద్యార్థులు డ్రగ్స్‌ వినియోగించినా, విక్రయించినా లేదా ఇతరులను మాదకద్రవ్యాల వైపు ప్రోత్సహించినా సంబంధిత విద్యాసంస్థలను బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు.

విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వ్యాప్తిని అడ్డుకోవడంలో విద్యాసంస్థల యాజమాన్యాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని డీజీపీ తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆయా విద్యాసంస్థలదేనని స్పష్టం చేశారు.

నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. అవసరమైతే వాటి లైసెన్సులు రద్దు చేయాలని సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, భవిష్యత్తును కాపాడేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి విద్యాసంస్థలో యాంటీ డ్రగ్స్‌ అండ్‌ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలని, క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్‌ను నియమించాలని డీజీపీ ఆదేశించారు. విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు.. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Spread the love

Related News

Latest News