- మహిళా న్యాయవాదుల సంక్షేమం, వృత్తి అభివృద్ధే ప్రధాన లక్ష్యం
ప్రతిపక్షం, జూలై 0, హైదరాబాద్, ఉప్పల్: ఉప్పల్ కోర్టు ఆవరణలో లేడీ బార్ అసోసియేషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కోర్టుకు చెందిన మహిళా న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొత్తగా ఏర్పాటైన లేడీ బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన అభివృద్ధి, పరస్పర సహకారం, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ లక్ష్యంగా పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. న్యాయవాద వృత్తిలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు యువ న్యాయవాదులకు మార్గదర్శకత్వం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మహిళా న్యాయవాదులు ఒకరినొకరు అభినందించుకుని, న్యాయరంగంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు సంఘటితంగా పనిచేయాలని సంకల్పించారు. భవిష్యత్తులో న్యాయ అవగాహన సదస్సులు, ఉచిత న్యాయ సలహా శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళా న్యాయవాదులు వృత్తిలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు అనురాధ రెడ్డి, సవితా రెడ్డి. సి హెచ్ చైతన్య, ఆర్. సునీత. సీనియర్ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి, పాండురంగ రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


















