హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్‌తో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రెండు అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూన్ 30: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో బ్యాంకు అందించిన రెండు అంబులెన్స్‌లకు సీఎం జెండా ఊపి ప్రారంభించగా, భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ స్కానర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాల చెల్లింపులను సక్రమంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు మరింత విస్తృతంగా రుణాలు అందించాలని సూచించారు.

స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్కులు, గోదాములు, రైస్ మిల్లుల ఏర్పాటు చేపడుతున్నామని, ఈ ప్రాజెక్టులకు అవసరమైన రుణాలను పెద్ద ఎత్తున మంజూరు చేయాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును సీఎం కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News