Trending Now

మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్‌తోనే సాధ్యం..

బీఆర్ఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 9 : భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం మళ్లీ వస్తేనే ముస్లిం మైనార్టీల సంక్షేమం అన్ని రంగాలలో జరుగుతుందని బీఆర్ఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మైనార్టీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అనేక నామినేటేడ్ పదవులలో ఇతర రంగాలలో ముందుకు తీసుకెళ్లెందుకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన కృషి మరువలేనిది అన్నారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి పదవులను ఇచ్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని గుర్తించాలని సూచించారు. 204 ముస్లిం మైనార్టీ వసతి గృహాలను నెలకొల్పడమే కాకుండా అందులో నాణ్యమైన విద్య, వైజ్ఞానిక వసతులను కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దేనినన్నారు. నిర్మల్ పట్టణంలో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణాలు ప్రారంభించిన ముస్లిం మైనార్టీల షాదిఖానా సముదాయం, స్వాతంత్ర సమరయోద్దేశ తొలి విద్యాశాఖ మంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్మారక క్లాక్ టవర్ నిర్మాణ పనులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్న అర్థాంతరంగా నిలిచిపోవడం దారుణమన్నారు. సందర్భంగా నిర్మల్ పట్టణంలో ని వైఎస్ఆర్ కాలనీ, ఆస్రా కాలనీలకు చెందిన పలువురు కాంగ్రెస్ ,వైయస్సార్సీపి ల ఆయా విభాగాల నాయకులు, పదాధికారులు బీఆర్ఎస్ లో చేరారు. టిఆర్ఎస్ నిర్మల్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీరుద్దీన్ సీనియర్ నాయకులు మొహమ్మద్ బిన్ అది,సయ్యద్ ఖాజా అక్రం అలీ,శేఖ్ అజీజ్, మహెబూబ్ ,శివాజీ, మహమ్మద్ మసూద్ ఖాన్, మొహమ్మద్ హబీబ్ ,వైఎస్ఆర్సిపి నిర్మల్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ రహీముద్దీన్ మండల అధ్యక్షుడు రియాజ్, రైసోద్దీన్, మహమ్మద్ అక్బర్, మిర్జా శోయేబ్ బేగ్, రిజ్వాన్ ఖాన్, నేల అనిల్ కుమార్ తదితరులు.

Spread the love

Related News