ప్రతిపక్షం, వెబ్ డెస్క్: స్నూకర్, బిలియర్డ్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ తన విజయవంతమైన కెరీర్‌లో మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బిలియర్డ్స్‌లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్‌కు స్థానం కల్పించారు. చైనాలోని షాంగ్రావొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను పొందుపరిచారు. ప్రపంచ విశిష్ట క్రీడాకారుల సరసన తన పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని పంకజ్ చెప్పాడు.