Best Teacher Award: ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. జాబితా విడుదల చేసిన సర్కార్

AP Best Teachers Awards: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 174 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. ఈనెల 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేయనున్నారు. మొత్తం పాఠశాల విద్యాశాఖ నుంచి 77 మంది, ఇంటర్మీడియట్‌ విద్యా శాఖలో 26 , పాలిటెక్నిక్‌ కళాశాలల లెక్చరర్లు 16, డిగ్రీ లెక్చరర్లు 19, ఇంజినీరింగ్, ఫార్మసీ లెక్చరర్లు 4, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు 32 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఈ జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

Related News

Latest News